పహల్గాం ఉగ్రదాడిలో నెల్లూరుకు చెందిన సాఫ్ట్వేర్ మృతి.. కావలిలో విషాద ఛాయలు

పహల్గాం ఉగ్రదాడిలో నెల్లూరుకు చెందిన సాఫ్ట్వేర్ మృతి.. కావలిలో విషాద ఛాయలు

జమ్ము కశ్మీర్ పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన మారణహోమం దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. విహారయాత్రకు వెళ్లిన టూరిస్టులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. చంపొద్దు అని వేడుకున్నా ఏ మాత్రం కనికరం లేకుండా దారుణంగా పొట్టనపెట్టుకున్నారు దుర్మార్గులు. ఈ ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మరణించారు. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన సాఫ్ట్ వేర్ మృతి చెందడంతో కావలిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన కావలి వాసి  సోమిశెట్టి మధుసూదన్  ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయాడు. బెంగళూరులో స్థిరపడ్డ మధుసూదన్ కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్ళగా ఈ  ఘటన జరిగింది. IBM సాఫ్ట్ వేర్ కంపెనీలో సీనియర్ ఆర్కిటెక్ గా విధులు నిర్వహిస్తున్నా మధుసూదన్. మధుసూదన్ ను కావలి అన్నాల వారి వీధిలో నివాసముండే సోమిశెట్టి తిరుపాలు, పద్మ దంపతుల కుమారుడిగా గుర్తించారు.

ALSO READ : Pahalgam attack:కాశ్మీర్ ఉగ్రదాడి.. మృతులువీరే

మృతుడు మధుసూదన్ కు భార్య మీనాక్షి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇవాళ (ఏప్రిల్ 23) ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని చెన్నైకి తరలించనున్నారు. అక్కడి నుంచి సాయంత్రానికి అతని పార్థివదేహాన్ని  కావలికి తీసుకొస్తారు. తల్లిదండ్రులు హుద్రోగ రోగులు (హార్ట్ పేషెంట్స్) కావడంతో విషయం రహస్యంగా ఉంచారు బంధువులు.