వర్క్ ఫ్రం హోంలో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. భార్య టార్చర్ వల్ల ఇలా చేశానని చెప్పాడు !

వర్క్ ఫ్రం హోంలో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. భార్య టార్చర్ వల్ల ఇలా చేశానని చెప్పాడు !

బెంగళూరు: భార్య వేధింపులు తాళలేక 26 ఏళ్ల యువకుడు రాజ్ భవన్ ముందు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన బెంగళూరు నగరంలో ఆదివారం సాయంత్రం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని హెబ్బల్ ప్రాంతంలో జుహెల్ అహ్మద్ అనే టెకీ నివాసం ఉంటున్నాడు.

తమిళనాడుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో బెంగళూరు రాజ్ భవన్ దగ్గరకు చేరుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న బ్యాగ్లో నుంచి పెట్రోల్ బాటిల్ తీసి రాజ్ భవన్ ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. నిప్పంటించుకోబోతున్న సమయానికి అక్కడున్న వాళ్లు గమనించి అతనిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.

అసలు.. ఎందుకిలా చేశావని అడిగితే.. తన భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక చచ్చిపోవాలనుకున్నానని చెప్పాడు. కొన్నాళ్లుగా హెబ్బల్లోని ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. ముస్కాన్ అనే యువతితో 2024, నవంబర్ 14న జుహేల్ అహ్మద్కు నిఖా జరిగింది. పెళ్లయిన కొన్ని వారాలకే భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఇద్దరికీ అస్సలు కుదరలేదు.

►ALSO READ | హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం..

ఎడ్డెమంటే తెడ్డెం అనే తరహాలో భార్యాభర్తల మధ్య పరిస్థితి తయారైంది. అతని భార్యకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, విడాకులు కావాలని బలవంతం చేస్తోందని జుహేల్ చెప్పాడు. లోకల్ రౌడీలు, కొందరు పోలీసులు కూడా తన భార్యకు అండగా నిలుస్తున్నారని.. తన భార్య, ఆమె కుటుంబ సభ్యులు చిక్బళ్లాపూర్ పోలీస్ స్టేషన్లో తనపై తప్పుడు ఫిర్యాదు కూడా చేశారని జుహేల్ వాపోయాడు.