తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలంటూ..సాప్ట్వేర్ ఇంజనీర్లను బురిడి కొట్టించిన సైబ‌ర్ నేర‌గాళ్లు

ఆన్‌లైన్ స్కామ్‌ల‌తో సైబ‌ర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు.  తాజాగా పార్ట్‌టైమ్ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న ఇద్దరు సాప్ట్ వేర్ ఇంజనీర్ల నుంచి రూ. 27 లక్షల స్వాహా చేశారు. తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు వస్తాయంటూ వారిని నమ్మించి బురిడి కొట్టించారు. ఈ ఘటన హైదరాబాద్ లోని  చిలకలగూడ, పంజాగుట్ట ప్రాంతాల్లో చోటుచేసుకుంది. 

Also Read:ఒడిశా రైలు ప్రమాదం వెనుక టీఎంసీ హస్తం : సువేందు అధికారి

ముందుగా పార్ట్ టైమ్ జాబ్ పేరుతో బాధితుల మొబైల్ ఫోన్ కు మెసేజ్ పంపారు సైబర్ నేరగాళ్లు.  ఆ తరువాత టెలిగ్రామ్ ఓ గ్రూప్లో వీరిని యాడ్ చేశారు. ముందుగా  బాధితులు ఇద్దరు వేరువేరుగా 15 లక్షలు, 12 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆ తరువాత వీరికి టాస్క్ లు ఇచ్చి పూర్తి చేసిన అనంతరం గంటల వ్యవధిలో  బాధితుల అకౌంట్లలో రూ.500 జమ చేశారు.  

దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మరం చేశారు.