సాప్ట్వేర్ కుటుంబం ఆత్మహత్య : వెలుగులోకి కీలక విషయాలు

హైదరాబాద్ :  కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.  పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగాలేదని వారికి విషమిచ్చి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కందిగూడ, క్రాంతి పార్క్ రాయల్ అపార్ట్మెంట్లో గాదె సతీష్ (39) అనే వ్యక్తి తన భార్య వేద (35), ఇద్దరు పిల్లలు నిషికేత్ (9), నిహాల్ (5)లతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే తమ పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగాలేదని వారి పిల్లలకు విషమిచ్చి  ఆ తర్వాత వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న కుషాయిగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కుషాయిగూడలో సాప్ట్వేర్ కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. గతకొంతకాలం సతీష్ దంపతుల పిల్లలు ఆటిజంతో బాధపడుతున్నారు. అయితే పిల్లల ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో సతీష్ ఆందోళనకు గురయ్యాడు. దీంతో ఇవాళ ఉదయం పిల్లలిద్దరికి విషమిచ్చి సతీష్ దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.