బాలీవుడ్ నటుడు సొహైల్ ఖాన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు శుక్రవారం ప్రకటించారు. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో తన క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా ఉంటుందని రివీల్ చేశారు. శుక్రవారం సొహైల్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో గ్లాసెస్ పెట్టుకుని స్టైలిష్ ప్రెజన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇందులో ఈవిల్డోర్‌గా అతని పాత్ర హైలైట్‌గా ఉంటుందని మేకర్స్ తెలియజేశారు. కళ్యాణ్ రామ్ నటిస్తున్న 21వ చిత్రమిది. విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుండగా, శ్రీకాంత్, సయీ మంజ్రేకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.