కామారెడ్డి, వెలుగు: మేరా మిట్టి మేరా దేశ్ ప్రోగ్రామ్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో మట్టి సేకరణ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు దిల్లీలో స్మృతివనం నిర్మాణం కోసం మట్టి సేకరణ ప్రోగ్రామ్చేపట్టారు. ఇందులో భాగంగా కొద్దిరోజులుగా బీజేపీ కామారెడ్డి నియోజక వర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని గ్రామాలు, తండాల్లో మట్టి సేకరణ చేపట్టారు.
చివరి రోజు జిల్లా కేంద్రంలో నిర్వహించారు. రైల్వే స్టేషన్ నుంచి షూరువయిన ర్యాలీ సిరిసిల్ల రోడ్డు, జేపీఎన్రోడ్డు, సుభాష్రోడ్డు, స్టేషన్ రోడ్డుల మీదుగా మట్టి కలశాలతో ర్యాలీ నిర్వహించారు. వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ... మేరా మిట్టి మేరా దేశ్ ప్రోగ్రామ్లో మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారన్నారు.