
రేవల్లి, వెలుగు: ఔషద మూలికలతో కూడిన మట్టి ద్వారా శరీరానికి రోగ నిరోధక శక్తి అందుతుందని డీఎంహెచ్వో శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం మండలంలోని నాగపూర్ గ్రామంలోని ఐకేపీ సెంటర్ లో యోగా థెరపిస్ట్ శ్రీను నాయక్ ఆధ్వర్యంలో మట్టి యోగం కార్యక్రమం నిర్వహించారు.
మట్టిలో ఉండే అనేక కణజాలాలు రోగ నిరోధక శక్తిని కలగజేస్తాయని చెప్పారు. ఎస్సై రాము, మాజీ సర్పంచ్ పాపులు, మాజీ ఎంపీటీసీ శ్రీశైలం పాల్గొన్నారు.