
సోలార్ సిటీని 2006లో ఇద్దరు అన్నదమ్ములు పీటర్, లిండన్ రైవ్ స్థాపించారు. వీళ్లకు ఈ కాన్సెప్ట్ ఐడియా ఇచ్చింది మాత్రం వాళ్ల కజిన్ ఎలాన్ మస్క్. ఆయనే ఈ కంపెనీ పెట్టడానికి సాయం చేశాడు. కంపెనీ పెట్టిన కొద్దిరోజుల్లోనే బాగా సక్సెస్ అయ్యింది. 2009 నాటికి కంపెనీ ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్ల నుంచి 440 మెగావాట్ల పవర్ వచ్చేది. 2011లో కంపెనీ క్లీన్ కరెంట్స్, గ్రోసోలార్ కంపెనీల నుంచి సోలార్ వింగ్స్‌ని కొనేసింది. తర్వాత సోలార్‌సిటీ చాలా ప్రాంతాలకు విస్తరించింది. 2013 నాటికి సోలార్‌సిటీ అమెరికాలోని ప్రముఖ రెసిడెన్షియల్ సోలార్ ఇన్‌స్టాలర్‌గా ఎదిగింది. 2015 నాటికి ప్యానెళ్లు 870 మెగావాట్ల సోలార్ పవర్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మార్చి 2016లో స్పేస్ ఎక్స్ కంపెనీ 90 మిలియన్ల డాలర్ల సోలార్‌సిటీ స్టాక్‌ను కొన్నది. అయితే.. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల సంస్థకు 2015 నుంచి నష్టాలు మొదలయ్యాయి. 2015 చివరి నాటికి సోలార్‌సిటీలో 15,273 మంది ఉద్యోగులు ఉన్నారు. 2016లో 20 శాతం మందిని కంపెనీ ఉద్యోగంలో నుంచి తొలగించింది.
టెస్లాకు అమ్మకం
టెస్లా కంపెనీ సోలార్ సిటీని కొంటున్నట్టు ఆగస్టు 1, 2016న ప్రకటించింది. ఆ తర్వాత కూడా కంపెనీ నష్టాల బాటలోనే నడుస్తోంది. కానీ.. భవిష్యత్తులో లాభాలు వస్తాయనే ఉద్దేశంతో మస్క్ దీన్ని నడుపుతున్నాడు.