రేపు శనివారం ( అక్టోబర 14) వచ్చే సూర్యగ్రహణం చాలా అరుదు. 178 ఏళ్ల తర్వాత ఈ గ్రహణం ఏర్పడుతోంది. ఈ సంవత్సరంలో రెండవ మరియు చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 14, సర్వపితృ అమావాస్య రోజున సంభవిస్తుంది. ఈ సంవత్సరంలో రెండవ మరియు చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 14, సర్వపితృ అమావాస్య రోజున సంభవిస్తుంది. నవరాత్రికి ముందు సంభవించే ఈ గ్రహణం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది.సూర్యగ్రహణం సమయంలో, బుధుడు మరియు సూర్యుడు కన్యారాశిలో ఉన్నారు, మరియు బుద్ధాదిత్య యోగం ఏర్పడుతుంది. అలాగే, ఈ రోజు శనివారం కాబట్టి, ఈ రోజును శని అమావాస్య అని పిలుస్తారు, ఈ రోజు పూర్వీకులకు తర్పణం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది.
సూర్యగ్రహణం సమయం:
ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 14 శనివారం రాత్రి 08:34 గంటలకు ప్రారంభమై.. తెల్లవారు జామున 02:25 గంటల కంటే ముందే ముగియనుంది. అయితే ఈ గ్రహణ ప్రభావం వలన మేష రాశి, కర్కాటక, తుల , మకరం రాశివారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సూర్య గ్రహణ ప్రభావం భారత దేశంలో లేకపోయినా గ్రహణ సమయంలో పూజ గదిలో దేవతలను తాకడం.. ఆలయాలు తెరవడం వంటి పనులు చేయవద్దని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
రేపు సూర్య గ్రహణం వెరీ వెరీ స్పెషల్ అంటున్నారు పండితులు .. ఇలాంటి గ్రహణం మళ్ళీ చూడాలంటే 23 ఏళ్లు ఆగాల్సిందేననట. హిందూ ధర్మంలో గ్రహణాలకు ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహణం వెనుక ఒక ఆధ్యాత్మిక కారణం ఉందని చాలా మంది నమ్ముతారు. సైన్స్ ప్రకారం భూమి, సూర్యుని మార్గం మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. అక్టోబర్ నెలలో రెండు వారాల వ్యవధిలో సూర్య , చంద్ర గ్రహణాలు రెండూ సంభవించనున్నాయి. సూర్య గ్రహణం రేపు ఏర్పడనుంది. ఈ గ్రహణం సర్వ పితృ అమావాస్య నాడు వస్తుంది. అంతేకాదు సూర్య గ్రహణం శనివారం అమావాస్య రోజున ఏర్పడనుంది. దీంతో ఈ రోజుకి మతపరమైన ప్రాముఖ్యత ఉంది.
ALSO READ: అక్టోబర్ 14 సూర్య గ్రహణం వెరీ వెరీ స్పెషల్: ఉంగరం ఆకృతిలో సూర్య వలయం
రింగ్ ఆఫ్ ఫైర్ గ్రహణం
ఈ గ్రహణాన్ని “రింగ్ ఆఫ్ ఫైర్” అని పిలుస్తారు, ఎందుకంటే ఈ గ్రహణ సమయంలో చంద్రుడు భూమి సూర్యుని మధ్య కు వెళ్లే సమయంలో సూర్య దూరం సగటు కంటే ఎక్కువగా ఉండటం వల్ల సూర్యుడు అతి చిన్నగా కనిపిస్తాడు. ఫలితంగా, సూర్యుని బయటి భాగం మాత్రమే కనిపిస్తుంది. మధ్య భాగం పూర్తిగా చంద్రునిచే కప్పబడి “రింగ్ ఆఫ్ ఫైర్” ప్రభావాన్ని సృష్టిస్తుంది.