
క్రోధి నామ సంవత్సరం (2025) పాల్గుణ మాసంలోని అమావాస్య ( మార్చి 29) చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఆ రోజున చాలా అరుదైన యాదృచ్చిక సంఘటనలు జరగబోతున్నాయి. ఆ రోజున మొదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది.. ఏఏ దేశాల్లో కనపడుతుంది... ఇండియాలో కనపడుతుందా.. లేదా అనే విషయాలను తెలుసుకుందాం. . .
ఈ ఏడాది (2025) మొదటి సూర్యగ్రహణం మార్చి 29 శనివారం రోజున ఏర్పడుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.16 గంటలకు ముగుస్తుంది. ఈ సూర్యగ్రహణం సమయంలో భూమిలోని కొన్ని ప్రాంతాలు పగలు.. కొన్నిప్రాంతాలు చీకటితో కప్పబడి ఉంటాయి. సూర్యగ్రహణం కొన్ని దేశాల్లో సంపూర్ణంగా.. మరికొన్ని దేశాల్లో పాక్షికంగా కనపడుతుంది. కొన్ని చోట్ల అపలు కనపడదు.
ఏఏ దేశాల్లో కనపడుతుందంటే..
ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం బెర్ముడా, ఆస్ట్రియా, బెల్జియం, ఉత్తర బ్రెజిల్, డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్, హంగేరీ, ఐర్లాండ్, మొరాకో, గ్రీన్‌ల్యాండ్, ఫిన్లాండ్, బార్బడోస్, ఉత్తర రష్యా, స్పెయిన్, సురినామ్, కెనడా తూర్పు ప్రాంతాలు, స్వీడన్, పోలాండ్, పోర్చుగల్, లిథువేనియా, హాలండ్, నార్వే, ఉక్రెయిన్, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్ సహా అమెరికాలోని తూర్పు ప్రాంతాలలో కనిపిస్తుంది.
భారతదేశంలో...
అయితే.. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. దీని కారణంగా దాని సూతక కాలంలో పాటించాల్సిన నియమాలను భారతదేశంలో పాటించాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు. ఈ గ్రహణం కనిపించే ప్రాంతాలలో సూర్యగ్రహణం ప్రారంభానికి 12 గంటల ముందు గ్రహణం సూతక కాలం ప్రారంభమవుతుంది