మార్చి 29 సూర్యగ్రహణం ... తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..!

మార్చి 29 సూర్యగ్రహణం ... తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..!

 మార్చి 29, 2025 శనివారం ఫాల్గుణ మాస అమావాస్య చంద్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశిలో ఉండగా, సూర్యుడు, చంద్రుడు, రాహువు ముగ్గురు మీన రాశిలో సంచరించే సమయంలో రాహుగ్రస్త్ర సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది.  ఈ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాటించాల్సిన నియమాలు గురించి  తెలుసుకుందాం. . 

పండితులు.. ఖగోళ శాస్త్రవేత్తలు  మార్చి 29న సంపూర్ణసూర్యగ్రహణం ఏర్పడుతుందని చెబుతున్నారు. ఈ సూర్య గ్రహణం ఏర్పడే పరిస్థితులను బట్టి పశ్చిమ దేశాల్లో యుద్ద వాతావరణం పెరగడం, ఆర్థికమాంద్యం కలగడం, ఉద్యోగస్థులకు, వ్యాపారస్థులకు ఇబ్బందితో కూడుకున్న వాతావరణం ఉండటం, రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.  

Also Read :  12 రాశుల వారు చేయవలసిన పరిహారాలు ఇవే..!


ఈ సంపూర్ణ సూర్య గ్రహణం అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, కెనడా, ఐరోపా, ఆఫ్రికా మరియు కొన్ని పశ్చిమ దేశాలలో కనిపించొచ్చని చిలకమర్తి తెలిపారు. ఉత్తరాబాధ్ర నక్షత్రం మీనరాశిలో ఈ సూర్య గ్రహణం ఏర్పడటం చేత, ఈ గ్రహణం ఏ దేశాల్లో అయితే సంభవిస్తుందో ఆ దేశాల్లో నివసించు భారతీయులు ముఖ్యంగా మీన, కన్య రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడకపోవడం మంచిదని చిలకమర్తి తెలిపారు. ఈ సూర్య గ్రహణ ప్రభావం మీన రాశికి, మేష రాశికి సింహ రాశికి, ధనస్సు రాశికి చెడు ఫలితాలను సూచిస్తున్నాయి.వృషభం, మిథునం, తుల రాశులకు అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. మిగిలిన రాశులకు మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

ALSO READ : జ్యోతిష్యం: మరికొన్ని గంటల్లో షష్టగ్రహకూటమి.. .. ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...

గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు:

  • సూర్య గ్రహణ సమయంలో ఉపనయనం అయిన వారు గాయత్రీ జపం చేయాలి. 
  • ఉపనయనం కాని వారు గురువుల ద్వారా పొందినటువంటి మంత్రోపదేశాన్ని అనుష్టానం చేయాలి. 
  • సూర్య గ్రహణ సమయంలో సూర్యారాధన చేయడం, రాహు గ్రహ జపం చేయడం మరియు దుర్గాదేవిని ఆరాధించడం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. 
  • సూర్య గ్రహణ సమయంలో గ్రహణానికి ముందు పట్టు స్నానం, గ్రహణం మధ్యలో మధ్య స్నానం, గ్రహణం పూర్తయ్యాక విడుపు స్నానం చేయాలి
  • గ్రహణ సమయంలో ఆహారం వంటి వాటిపైన దర్బను ఉంచడం మంచిది.
  • గ్రహణ సమయంలో ధ్యానం ఆచరించడం శ్రేష్టం.