మహిళా సంఘాలకు సోలార్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మహిళా సంఘాలకు సోలార్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పెద్దపల్లి, వెలుగు: మహిళా సంఘాలతో సోలార్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేయిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించి, ఉత్పత్తి అయిన కరెంట్‌‌‌‌‌‌‌‌ను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం, జూలపల్లి, పెద్దపల్లి మండల్లాలో చేపట్టిన రూ. 85 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, విజయరమణారావు, రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌ మక్కాన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌తో కలిసి శనివారం భూమి పూజ చేశారు. జూలపల్లి మండలం కాచాపూర్‌‌‌‌‌‌‌‌లో, పెద్దపల్లి మండలం రంగాపూర్‌‌‌‌‌‌‌‌, రాఘవాపూర్‌‌‌‌‌‌‌‌లో సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్ల నిర్మాణానికి, పెద్దపల్లిలో అమృత్‌‌‌‌‌‌‌‌ స్కీం కింద మంచినీటి పథకం విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ధర్మారంలో మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్దపల్లి జెండా వద్ద జరిగిన ప్రగతి సభలో డిప్యూటీ సీఎం విక్రమార్క మాట్లాడారు. 

సోలార్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ల ఏర్పాటులో భాగంగా కాచాపూర్‌‌‌‌‌‌‌‌లో పైలెట్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభిస్తామన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకే సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. సోలార్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ల ద్వారా సుమారు 20 వేల మెగావాట్ల విద్యుత్‌‌‌‌‌‌‌‌ను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మహిళలపై గౌరవంతోనే వారి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఫ్రీ బస్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ. 400 కోట్లు ఆర్టీసీకి చెల్లిస్తోందన్నారు. గతంలో పాదయాత్ర సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానన్నారు. పత్తిపాక రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ అంశాన్ని బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో పొందుపరిచారమన్నారు. పెద్దపల్లిలో బైపాస్‌‌‌‌‌‌‌‌ రోడ్డు, మానేరు వాగుపై ఓదెల మండలం రూపు నారాయణపేట వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు హర్కర వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌, కోమటిరెడ్డి నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

దశలవారీగా అభివృద్ధి పనులు : ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఐటీ మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు చెప్పారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి మొదటి అడుగు వేశామన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక్కరోజే రూ. 85 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టడం గొప్ప విషయం అన్నారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, వివిధ కారణాల వల్ల ఆగిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేసి తీరుతామన్నారు. 


రైతుల సంక్షేమానికి పెద్దపీట

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చెప్పారు. పదేండ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ హయాంలో రైతులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. అప్పుల పాలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కృషి చేస్తున్నారన్నారు. ఎల్లంపల్లి ముంపు బాధితులకు ప్రభుత్వం రూ. 18 కోట్లు పరిహారం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసిందని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు, మహిళల సంక్షేమానికి, నాణ్యమైన కరెంట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, ఓల్టేజీ సమస్య తలెత్తకుండా విద్యుత్‌‌‌‌‌‌‌‌ సరఫరా చేస్తామని, ఇందుకోసం సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్ల సంఖ్యను పెంచుతున్నామన్నారు.