- పైలెట్ ప్రాజెక్ట్ గా నల్గొండ జిల్లా ఆయిటిపాముల
- 50 మందికి రూ.లక్ష విలువైన సోలార్ బ్యాటరీలు
- ఆర్థికసాయానికి ముందుకొచ్చిన ప్రతీక్ ఫౌండేషన్
నల్గొండ, వెలుగు: గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సోలార్ రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తికి అడుగులు పడుతున్నాయి. పైలెట్ ప్రాజెక్ట్ గా నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఆయిటిపాముల ఎంపి కైంది. 50 మంది పొదుపు సంఘాల మహిళలకు సోలార్ పవర్ బ్యాటరీల ను అందించేందుకు ఆర్థిక సాయానికి ప్రతీక్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. యూనిట్లలో ఉత్పత్తి అయిన కరెంట్ ను స్వ బ్యాగ్స్ ల్యాబ్స్ కొనుగోలు చేయనుండగా ఇందుకు ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా మహిళలతో సోలార్ యూనిట్లు నెలకొల్పేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
ఒక్కో మహిళకు రూ. లక్షతో యూనిట్
నిరుపేద మహిళలు యూనిట్ల ఏర్పాటుకు ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సహకారం అందించనున్నారు. ఇందిరా మహిళా స్వశక్తి కింద ఒక్కొక్కరికి రూ. లక్ష విలువైన సోలార్ బ్యాటరీలను 50 మందికి అందించేందుకు రూ.50 లక్షల చెక్కును ఇప్పటికే పంపిణీ చేశారు. ఒక్కో యూనిట్ కింద రూ. లక్షతో 2 కిలో వాట్ బ్యాటరీ, 540 వాట్స్ ప్యానెల్స్ 2 అందజేస్తారు.
ఒక్కో దాని ద్వారా రోజుకు 4 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. బ్యాటరీ ఫుల్ అయ్యాక ఇంటి వద్దకే వచ్చి తీసుకుంటారు. మళ్లీ ఖాళీ బ్యాటరీలను ఇస్తారు. బ్యాటరీల స్టేటస్ తెలుసుకునేందుకు ఆయిటిపాములలో టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. దీంతో బ్యాటరీ పర్స౦టేజ్ వివరాలు ఆన్ లైన్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఒక బ్యాటరీకి 2,000 లైఫ్ సైకిల్స్ ఉండగా, ఒక్క బ్యాటరీ 2,000 సార్లు చార్జింగ్ చేసుకోవచ్చు. అందుకు సరిపడా పరికరాలను అందజేస్తారు.
ట్రాన్స్ కో కంటే అధికంగా ధర చెల్లింపు
సోలార్ యూనిట్లలో ఉత్పత్తి అయిన విద్యుత్ ను ట్రాన్స్ కో కొనుగోలు చేసే ధర కంటే అధికంగా చెల్లిస్తారు. ఇంటిపైన సోలార్ సిస్టమ్ పెట్టకుంటే కొంత సొంత అవసరాలకు వాడుకొని, మిగిలింది ట్రాన్స్ కో సంస్థకు కు అమ్ముకునే వెసులుబాటు ఉంది. ట్రాన్స్ కో యూనిట్ కు రూ.3కు వినియోగదారులకు అందిస్తుంది. అయితే స్వబ్యాగ్ ల్యాబ్స్ కంపెనీ సోలార్ పవర్ ను యూనిట్ ధర రూ.16 కొనుగోలు చేయనుంది. రోజుకు ఒక్కో సోలార్ యూనిట్ ద్వారా 4 యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఇలా నెలకు ఒక్కో మహిళ రూ.3 వేల నుంచి రూ.4 వేల ఆదాయం సంపాదించవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా అమలుకు చర్యలు
పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన నల్గొండ జిల్లాలో విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలుకు చర్యలు తీసుకుం టారు. ఇందుకు ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు. మహిళలు ముందుకొచ్చి ఏర్పాటు చేసుకుని అదనపు ఆదాయం పొందుతూ కుటుంబాలకు అండగా నిలబడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇలాంటి యూనిట్లను మరిన్ని ప్రారంభిస్తే భవిష్యత్ లో ఆర్థికంగా బలపడే ఆలోచన చేస్తున్నారు.
ఆర్థికంగా బలోపేతం చేస్తం
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సోలార్ బ్యాటరీ ఎనర్జీ యూనిట్లు బాగా ఉపయోగపడతాయి. తమ పనులకు చేసు కుంటూనే నెలకు అదనంగా ఆదాయం పొం దవచ్చు. భూమి లేని నిరుపేద కుటుంబా లకు నెలకు రూ. 3 వేల నుంచి రూ. 4 వేల ఆదాయం వచ్చే విధంగా స్వ బ్యాగ్స్ ల్యాబ్ సహకారంతో సోలార్ బ్యాటరీ ఎనర్జీ యూని ట్లు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలోనే తొలిసారి గా నల్గొండ జిల్లాలో ప్రారంభిస్తున్నాం. లబ్ధి పొందిన మహిళల కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయి.
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి