ఫ్రీ హాస్టల్.. ఫ్రీ ట్రైనింగ్: సోలార్​ టెక్నీషియన్స్​ జాబ్.. రేపే లాస్ట్ డేట్ 

90 డేస్​ ఫ్రీ ట్రైనింగ్

సోలార్​ టెక్నీషియన్స్​గా ఉద్యోగం

ఉచిత హాస్టల్, భోజన సదుపాయం

నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ సోలార్​ ఎనర్జీ (ఎన్​ఐఎస్​ఈ) సూర్యమిత్ర స్కిల్​ డెవలప్​మెంట్ ప్రోగ్రామ్​ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు సోలార్​ టెక్నీషియన్స్​గా ఉచిత శిక్షణ ఇచ్చి అనంతరం ఉపాధి కల్పించేందుకు ప్రకటన విడుదల చేసింది. 90 రోజుల పాటు ఫ్రీ ట్రైనింగ్​ ఇచ్చి ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలోని వివిధ సోలార్​ కంపెనీల్లో ఉద్యోగం ఇస్తారు.

 

కోర్సు: సోలార్ ప్యానెల్​ ఇన్​స్టాలేషన్​ టెక్నీషియన్స్​

అర్హత: ఐటీఐ, డిప్లొమా పాస్​ అయిన యువతీయువకులు అర్హులు

ట్రైనింగ్​: ఆసక్తి గల అభ్యర్థులకు ఘట్​కేసర్​లోని అన్నోజిగూడలో ఉన్న ఎన్​ఐఎస్ఈ కు చెందిన రాష్ర్టీయ విద్యా కేంద్ర క్యాంపస్​లో ఉచితంగా హాస్టల్​ వసతి, భోజన సదుపాయం కల్పించి 3 నెలల పాటు ఫ్రీ ట్రైనింగ్​ ఇస్తారు. అనంతరం రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట్, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని సోలార్ పవర్ ప్లాంట్స్​తో పాటు ప్రైవేటు కంపెనీల్లోనూ ఉద్యోగాలు కల్పిస్తారు. ట్రైనింగ్​లో సోలార్​ ప్యానెల్స్​ ఇన్​స్టాలేషన్​, మెయింటెనెన్స్​ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఎన్​ఐఎస్​ఈ ద్వారా సర్టిఫికెట్​ ప్రదానం చేస్తారు.

దరఖాస్తుకు చివరితేది: 2019 జూలై 15

వివరాలకు: 7995601517, 63026
57884  ఫోన్​ నంబర్లలో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు లేదా rvksuryamitra@gmail.com మెయిల్​ ఐడీలో సంప్రదించవచ్చు. లేదా నేరుగా రాష్ర్టీయ విద్యా కేంద్రంలో ఒరిజినల్​ సర్టిఫికెట్లు సబ్​మిట్​ చేసి అడ్మిషన్​ పొందవచ్చు.