నిరుద్యోగులకు సోలార్ ​ఎనర్జీపై ఉచిత శిక్షణ

నిరుద్యోగులకు సోలార్ ​ఎనర్జీపై ఉచిత శిక్షణ

పంజాగుట్ట, వెలుగు : సోలార్​ఎనర్జీపై నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పిస్తున్నామని ‘గ్రీన్​యుర్జా టెక్నాలజీస్​అండ్​ సిస్టమ్స్’​ తెలిపింది. ఐటీఐ, పాలిటెక్నిక్​పూర్తిచేసిన నిరుద్యోగులకు సోలార్​నేషనల్​ఎనర్జీ సంస్థ ద్వారా ‘సూర్య మిత్ర స్కిల్​ డెవలప్​మెంట్ స్కీం’ కింద ఈ కోర్సు అందిస్తున్నట్టు పేర్కొంది. 

అక్టోబర్​4వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలంది. శిక్షణ టైంలో ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామని చెప్పింది. మరిన్ని వివరాలకు 83338 37632 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.