నందిపేట, వెలుగు : గణేశ్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు సూచించారు. మంగళవారం నందిపేట మండలం ఉమ్మెడ శివారులోని గోదావరి నదిలో విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రాంతాన్ని సీపీ సత్యనారాయణ, జడ్పీ చైర్మన్ విఠల్‌రావు తో కలిసి పరిశీలించారు.
నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉమ్మెడ, కొండూర్ సర్పంచులకు ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.