సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ నిర్వహణ బాగుందని పలు మున్సిపాలిటీలకు చెందిన కమిషనర్లు కితాబిచ్చారు. స్థానిక మున్సిపాలిటీలో నూతన పారిశుధ్య విధానాన్ని శుక్రవారం ఖమ్మం జిల్లా మధిర, వైరా,సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్ నగర్, నేరేడు చర్ల, తిరుమలగిరి మున్సిపల్ కమిషనర్లు, సానిటరీ ఇన్స్పెక్టర్లు, ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్లు సందర్శించారు.
పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు ప్రక్కన గల సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను సందర్శించి మురికి నీటిని ట్రీట్ మెంట్ చేసే విధానాన్ని, బాలెంల డంపింగ్ యార్డ్ ను సందర్శించి, సెమి ఆటో మీటర్ సాలిడ్ వెస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్ ను పరిశీలించారు. చెత్తను సెగ్రి గ్రేషన్, స్టోరేజ్ విధానాన్ని చూశారు. ప్లాస్టిక్ ముడిపదార్ధాన్ని పైపుల తయారీకి అమ్మతున్నామని, వాటి ద్వారా మున్సిపాలిటీలి కి ఆదాయం సమకూరుతుందని మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, కమిషనర్ బి. శ్రీనివాసు తెలిపారు.
కార్యక్రమంలో వైరా కమిషనర్ చింతావేణు, మధిర కమిషనర్ సంపత్, కోదాడ కమిషనర్ రమాదేవి, హుజూర్ నగర్ కమిషనర్ యాకుబ్ పాషా,తిరుమల గిరి కమిషనర్ బుచ్చిబాబు,నేరేడు చర్ల కమిషనర్ అశోక్ రెడ్డి, మున్సిపల్ డీఈ సత్యారావు, సానిటరీ ఇన్స్పెక్టర్లు సారగండ్ల శ్రీనివాస్, హెల్త్ అస్సిటెంట్ సురేశ్, తదితరులు పాల్గొన్నారు.