- దాడులను అరికట్టేందుకు ఐక్య పోరాటాలు చేయాలి
- ధర్నా చౌక్ వద్ద జరిగిన సదస్సులో వక్తలు
ముషీరాబాద్/ వికారాబాద్, వెలుగు : హిందువుల హక్కుల సాధన కోసం సంఘటిత పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్ లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులకు తెగబడటం అత్యంత దారుణమన్నారు. ఇస్కాన్ స్వామీజీ చిన్మయి కృష్ణదాస్ ను బేషరతుగా విడుదల చేయాలని, హిందువులను రక్షించాలని కోరారు. ఈ మేరకు హిందూ ఐక్యవేదిక, భాగ్యనగర్ గణేశ్ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బుధవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సంఘీభావ సదస్సు జరిగింది.
ఐక్యవేదిక ప్రతినిధులు, ఉత్సవ సమితి నేతలు, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ పీఠాల స్వామీజీలు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ జాతీయ కమిటీ సభ్యుడు భాగయ్య మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ గతంలో అఖండ భారత్ లో భాగమేనని గుర్తుచేశారు. అక్కడి హిందువులపై దాడులు జరగడం దారుణమన్నారు. చిన్న జీయర్ స్వామి ఆశ్రమ ఉత్తరాధికారి దేవానంద జీయర్ స్వామి మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ లో హిందువులపై నరమేధం జరగడం దారుణమన్నారు. హిందువుల సహనం, ఓర్పును పరీక్షొద్దని అవసరమైతే ప్రతిదాడులు చేయాడానికి సిద్ధంగా ఉంటారని హెచ్చరించారు.
దేశంలోని హిందూ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి హిందువుల పరిరక్షణకు పాటు పడాలని కోరారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు. అలాగే బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను ఆపాలని కోరతూ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ గంజ్ హనుమాన్ టెంపుల్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. హిందూ ఐక్య వేదిక సభ్యుడు డాక్టర్ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే కేఎస్రత్నం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, అన్ని పార్టీల నాయకులు అన్నారు.