ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంట్ గా ఉన్నావ్.. పెళ్లి చూపులు ఇలా కూడానా..!

టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు.. ఐడియా ఏ ఒక్కరిదో కాదు అంటోంది సోషల్ మీడియా.. తమ తమ సృజనాత్మకతను చూపించుకోవటానికి అద్భుత ఐడియాలతో ముందుకొస్తున్నారు పబ్లిక్. గతంలో ఆ వీధిలో.. ఆ ఊరికో మాత్రమే తెలిసేది.. సోషల్ మీడియా పుణ్యమా అని.. అది ఇప్పుడు గల్లీ టాలెంట్ సైతం గ్లోబల్ అవుతుంది.. పెళ్లి సంబంధం కోసం ఓ యువకుడు పబ్లిక్ బ్యానర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు.. తన పెళ్లి కోసం అమ్మాయి కావాలంటూ.. రోడ్డుపై.. తన సైకిల్ కు బ్యానర్ కట్టాడు.. దాని సారాంశం ఏంటో చూద్దామా..

నేనంటే ఇష్టం ఉన్న అమ్మాయి ఎవరైనా.. తన పేరు, మొబైల్ నెంబర్ ఇక్క నమోదు చేసి.. వీలు ఉన్న రోజున నన్న కలవగలరు. కుల పట్టింపు లేదు.. నమ్మకం లేని వారు దయచేసిన మీ వివరాలు నాకు ఇవ్వవద్దు.. We dont Miss Understand I wand a firl for my Marriage, its not Business

Also Read : రంగురంగుల వీడియోలు పెట్టే కవితకు.. ప్రవల్లిక ఆత్మ ఘోష వినబడటం లేదా!?

గమనిక : మనస్ఫూర్తిగా ఇష్టం ఉన్న వారు మాత్రమే తన పేరును, మొబైల్ నెంబర్ ను ఇక్కడ నమోదు చేయండి. ఇష్టం లేని వారు దయచేసి నా సమయాన్ని వృధా చేయరాదు.. ఇట్లు దేవన నీలకంఠ అయ్యప్ప కుమార్, బీకాం, అడ్రస్ : కనక నాగవరపమ్మ గుడి రోడ్, ఎంపీపీ స్కూల్ ఎదురు, బులుగు రంగు ఇల్లు, రామన్నపేట అంటూ తన అడ్రస్ మొత్తాన్ని ఇచ్చేశాడు ఈ టాలెంటెడ్ పర్సన్. ఊరు పేరు మాత్రం, జిల్లా, రాష్ట్రం మాత్రం బ్యానర్ లో లేదు.. 

దీనిపై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి.. మరీ టాలెంట్ ఎక్కువైంది ఒకరు అంటే.. పెళ్లికాని ప్రసాద్ ల బాధ ఇలా చెప్పుకుంటున్నారు అంటూ మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పెళ్లికి అమ్మాయి దొరకటం లేదనే బాధ ఈ యువకుడిలో.. ఈ బ్యానర్ సాక్షిగా కనిపిస్తుంది.. ఇంత నిజాయితీని గుర్తించి అయినా.. ఏ అమ్మాయి అయినా దొరకాలంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు..