
ముషీరాబాద్, వెలుగు: పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీఓ తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం కోరింది. ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సందిల బలరాం నేతృతంలోని బృందం బుధవారం పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీజను కలిసి వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలను కమిషనర్ కు వివరించారు.
అనంతరం బలరాం మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో అనేక సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం రూపొందించిన డైరీ, క్యాలెండర్ ను ఆవిష్కరించారు. సెంట్రల్ ఫోరం కార్యదర్శి వెంకట రామకృష్ణ, మల్లేశం గౌడ్, వేమారెడ్డి, బాల్ రాజ్, కె.మధుకర్ రెడ్డి, రామ్ విహార్, జ్ఞానేశ్వర్, కిషోర్, రమేశ్ పాల్గొన్నారు.