
- టీచర్ల, పాఠశాలల్లో సమస్యలను పరిష్కరిస్తా
కామారెడ్డి, ప్రతినిధి : ఆశీర్వదించి గెలిపించాలని, ఉపాధ్యాయుల వెన్నంటే ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని కరీంనగర్ టీచర్స్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వరలక్ష్మి గార్డెన్ సోమవారం తపస్ కామారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేనే టీచర్లు, పాఠశాలల సమస్యలు పరిష్కారం కావాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు బీజేపీ అభ్యర్థుల గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయన్నారు.
తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. కామారెడ్డిలో 17వ వార్డు మాజీ కౌన్సిలర్ బీజేపీ నేత అవధూత నరేందర్ ను ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్య మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొమరయ్యను అవధూత నరేందర్ శాలువాతో సత్కరించారు.