IPL 2025: ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ .. వేలంలోకి రానున్న స్టార్ ఆటగాళ్లు వీళ్ళే

IPL 2025: ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ .. వేలంలోకి రానున్న స్టార్ ఆటగాళ్లు వీళ్ళే

ఐపీఎల్ 2025 రిటైన్ చేసుకునే ప్లేయర్ల సమయం దగ్గర పడుతుంది. 2025 ఐపీఎల్ కోసం మెగా ఆక్షన్ జరగనుండడంతో ఎవర్ని రిటైన్ చేసుకోవాలో అనే విషయంపై అన్ని ఫ్రాంఛైజీలు బిజీగా ఉన్నాయి. అక్టోబరు 31 (గురువారం) సాయంత్రం 5 గంటలలోపు ప్రతి జట్టు తమ రిటైన్డ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాలి. నవంబర్ చివరి వారంలో జరగనున్నఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు అందరు ఫ్రాంచైజీలు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతిని ఇచ్చింది. కొన్ని జట్లు స్టార్ ఆటగాళ్లను మెగా ఆక్షన్ లోకి వదిలేయనున్నట్టు సమాచారం. వారెవరో ఇప్పుడు చూద్దాం 

రాహుల్, పంత్, అయ్యర్:

భారత  స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ లు ఈ సారి మెగా ఆక్షన్ లోకి రానున్నట్టు సమాచారం. వీరు ముగురు ఆయా ఫ్రాంచైజీలకు కెప్టెన్సీ చేస్తున్న సంగతి తెలిసిందే. కేఎల్ రాహుల్ ను లక్నో విడిచిపెట్టింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అతని స్ట్రైక్ రేట్ పై లక్నో యాజమాన్యం అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. దీంతో పూరన్ కు పగ్గాలు అప్పగించి రాహుల్ ను మెగా ఆక్షన్ లోకి వదిలేయాలని చూస్తున్నారు. పూరన్ తో పాటు మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, మెషిన్ ఖాన్, ఆయుష్ బడోనీలను ఆ జట్టు రిటైన్ చేసుకోనుంది. 

Also Read :- కింగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్

పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వదిలి వేరే ఫ్రాంచైజీలోకి వెళ్లాలని చూస్తున్నాడట. ఒకవేళ పంత్ మెగా ఆక్షన్ లోకి అతని కోసం చాలా జట్లు ఎదురు చూస్తున్నాయి. మరోవైపు అయ్యర్ తనకు మొదటుకి రిటెన్షన్ కావాలని పట్టు పడుతుండడంతో కోల్ కతా యాజమాన్యం అందుకు సిద్ధంగా లేనట్టు సమాచారం. రస్సెల్, నరైన్, రమణ్ దీప్ సింగ్ లను కేకేఆర్ రిటైన్ చేసుకోనున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. వీరితో పాటు ముంబైగా ఇండియన్స్ ఇషాన్ కిషన్, రాజస్థాన్ రాయల్స్ చాహల్ ను వదిలేయనుంది. 

బట్లర్, మ్యాక్ వెల్ కు నో ఛాన్స్

ఫారెన్ ప్లేయర్ల విషయానికి వస్తే బట్లర్, బోల్ట్ పై రాజస్థాన్ రాయల్స్ ఆసక్తి చూపించడం లేదు. సంజు శాంసన్, జైశ్వాల్ ను మాత్రమే రాజస్థాన్ రిటైన్ చేసుకోనుందని పలు నివేదికలు తెలుపుతున్నాయి. ఇక ఆర్సీబీ డుప్లెసిస్ తో పాటు ఫారెన్ ప్లేయర్లలందరిని బెంగళూరు జట్టు వదిలేసుకున్నట్టు సమాచారం. ఈ లిస్టులో గ్రీన్, మ్యాక్స్ వెల్ ఉన్నారు. 2024 ఐపీఎల్ మినీ వేలంలో రికార్డ్ స్థాయిలో 24.75 కోట్లకు అమ్ముడుపోయిన మిచెల్ స్టార్క్ ఈసారి మెగా ఆక్షన్ లోకి రానున్నారు.