జగిత్యాల బల్దియా మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బీఆర్ఎస్ కౌన్సిలర్ల బాయ్ కాట్

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల బల్దియా కౌన్సిల్ సమావేశాన్ని బుధవారం కొత్త చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ అడువాల జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు. కాగా ఈ సమావేశానికి కొందరు బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్లు హాజరుకాలేదు. ఇటీవల చేపట్టిన చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ ఎన్నిక విషయంలో నిరసన తెలుపుతూ సమావేశాన్ని బాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే కొందరు కౌన్సిలర్లు మాత్రం మునిసిపల్ ఎజెండా 48 గంటల ముందు ఇవ్వకుండా ఒకరోజు ముందు మాత్రమే ఇచ్చారని అందుకే బాయ్ కాట్ చేసినట్లుగా చెప్పుకొచ్చారు. కౌన్సిలర్లు బాయ్ కట్ చేసినప్పటికీ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం యథావిధిగా జరిగింది.