భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పట్టణంలోని పాత కొత్తగూడెంలో దాదాపు రూ. 2కోట్ల కు పైగా విలువైన దాదాపు 2వేల గజాల గవర్నమెంట్ ల్యాండ్‌ను కొందరు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు ఆక్రమించుకున్నారు. కబ్జా చేసిన ల్యాండ్‌లో శుక్రవారం రాత్రికి రాత్రే కంపౌండ్ వాల్ నిర్మించారు. పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు గతంలో దాదాపు 30 ఎకరాల ల్యాండ్‌ను సేకరించి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ కు ప్రజాప్రతినిధులు ఎవరూ గుర్తు పట్టకుండ ప్రస్తుతం ఉన్న కాంపౌండ్ వాల్మాదిరిగా మరో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టారు. స్థానికులు తహసీల్దార్ పుల్లయ్య దృష్టికి శనివారం తీసుకెళ్లారు. దీంతో ఆయన అక్కడికి వెళ్లి కాంపౌండ్ వాల్‌ను కూల్చివేయించారు. ఆక్రమించుకున్న వారి వివరాలను సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు.