రేవంత్ను ముఖ్యమంత్రిని చేయాలి.. గచ్చిబౌలి హోటల్ ఎల్లా వద్ద కార్యకర్తల ఆందోళన

రేవంత్ను ముఖ్యమంత్రిని చేయాలి.. గచ్చిబౌలి హోటల్ ఎల్లా వద్ద కార్యకర్తల ఆందోళన

కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మంగళవారం (డిసెంబర్ 5న) సాయంత్రం సీఎం ఎవరు అన్న క్లారిటీ రానుంది. ఈలోపే కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా వద్ద కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు హంగామా చేశారు. 

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలంటూ నినాదాలు చేశారు. ఒకదశలో హోటల్లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులను నిలువరించి.. బయటకు పంపించారు.  

మరోవైపు..రేవంత్ రెడ్డి సీఎం కావాలని ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో అక్కడ కలకలం రేగింది. అంతేకాదు.. రేవంత్ ను సీఎం చేయాలంటూ మరో వ్యక్తి కూడా ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆందోళన చేశారు. ఈ వరుస సంఘటనలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. 
 

Also Read:-ముహూర్తం బాగుంది : 7న కొత్త ప్రభుత్వం ఏర్పాటు