ఢిల్లీలో పొగమంచు.. విమానాల దారి మళ్లింపు

న్యూఢిల్లీ: ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా రైళ్లు, విమానాల సర్వీసులకు ఆటంకం కలుగుతోంది. లో విజిబిలిటీ కారణంగా13 విమానాలను రద్దు చేశారు. ఆరు విమానాలను జైపూర్​కు దారి మళ్లించారు. 26 ట్రైన్, 329 ప్లైట్ సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. లో విజిబిలిటీ కారణంగా ఎయిర్ పోర్టులో రాకపోకలను కాసేపు నిలిపేశామని ఓ అధికారి తెలిపారు. ఈమేరకు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ ‘ఎక్స్’లో ఓ పోస్ట్ పెట్టింది.‘‘ఢిల్లీ ఎయిర్ పోర్టులో రన్ వే విజిబిలిటీ మెరుగుపడుతోంది. విమాన సర్వీసులను క్రమంగా పునరుద్ధరిస్తున్నాం” అని పేర్కొంది. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కూడా సర్వీసులపై అప్ డేట్ ఇచ్చింది. కాగా, ఢిల్లీకి ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.