సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ది శతాబ్దాలుగా మనల్ని కలవరపెడుతున్న అనేక ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానాలు ఇస్తోందనే చెప్పాలి. ఫోబియా, ఆందోళన వంటి అంశాలు బాగా పరిశోధించబడిన అంశాలు అయినప్పటికీ అటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి మార్గాలు లేదు. అయితే ఆన్ లైన్ గేమింగ్ సమాచార సైట్ అయిన ఇండివిజిబుల్ గేమ్ లోని నిపుణులు VR హెడ్ సెట్లు శారీరక, మానసిక శ్రేయస్సు రెండింటికీ దోహదపడే ఐదు మార్గాలను హైలైట్ చేశారు.
ఫోబియాను పరిష్కరించడం
భయాందోళలను సమర్ధవంతంగా పరిష్కరించడానికి లేదా తగ్గించడానికి వైద్య నిపుణులు VR టెక్నాలజీని ఉపయోస్తారట.నియంత్రిత వర్చువల్ వాతావరణంలో సాలె పురుగులు, రద్దీగా ఉండే ప్రదేశాలు లేదా ఎత్తులకు వెళ్లినప్పుడు కలిగి భయాలను రోగులు సమర్ధవంతంగా ఎదుర్కొవచ్చునట. VR టెక్నాలజీతో ఇటువంటి భయాలనుంచి బయటపడేయచ్చంటున్నారు.
దీర్ఘకాలిక నొప్పి ఉపశమనం :
వర్చువల్ రియాలిటీతో ఆటలు, వినోదం అందిస్తూ.. దృష్టిని మళ్లించడం ద్వారా దీర్ఘకాలిక నొప్పులను తగ్గించవచ్చంటున్నారు. ఆపరేషన్ల నుంచి కోలుకుంటున్న రోగులు, ప్రసవానంతరం లేదా క్యాన్సర్ చికిత్సలో ఉన్న రోగులకు నొప్పిని సమర్థవంతంగా నివారించడంలో సహాయపడటానికి VR ను ఉపయోగిస్తు్న్నారట.
VR గేమింగ్ ద్వారా కేలరీల బర్నింగ్:
VR హెడ్ సెట్ లు గేమర్లను వారి శరీరాలు, చలన నియంత్రణలను ఉపయోగించి వర్చువల్ స్థానాలను అన్వేషించడం ప్రోత్సహించడం ద్వారా శారీరక శ్రమను ప్రోత్సహిస్తాయి. VR గేమింగ్ సెషన్లలో ఆటగాళ్లు వారి బరువు, కదలిక పరిధిని బట్టి నిమిషానికి 13కేలరీల వరకు బర్న్ చేయగలరని VR హెల్త్ ఇన్ స్టిట్యూట్ నివేదికలు చెబుతున్నాయి.
మోటార్ స్కిల్స్, కాగ్నిటివ్ ఎబిలిటీస్ :
బీట్ సాబెర్ వంటి ప్రసిద్ధ VR గేమ్ లు శారీరక వ్యాయామంగా మాత్రమే కాకుండా అద్భుతమైన మానిసక ఉత్తేజాన్ని అందిస్తాయంటున్నారు నిపుణులు. అవి మెరుగైన దృష్టి, మెరుగైన జ్ణాన సామర్థ్యాలు, మెరుగైన జ్ణాపక శక్తికి దోహదం చేస్తాయి. ఇటువంటి గేమ్ లు ఆటగాళ్ల సమస్య పరిష్కారానికి , శ్రద్ధ వహించేందుకు ప్రోత్సహిస్తాయి. తద్వారా వారి మనస్సులను అప్రమత్తంగా , చురుకుగా ఉంచుతాయి.
సామాజిక ఐసోలేషన్, ఆందోళన తగ్గించడం:
VR వినియోగించడం ద్వారా నిరాశ, సామాజిక ఒంటరితనాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా కోవిడ్ 19 మహమ్మారి సమయంలో VR అనుభవాలు లాక్ డౌన్ ఒంటరితనాన్ని సమర్ధవంతంగా తగ్గించాయని , సమాజిక ఒంటరితనం, నిరాశ,సామాజిక ఆందోళన ఉన్న వ్యక్తులకు మద్దతునిచ్చాయని కనుగొన్నారు.
VR వినియోగించడం ద్వారా కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉంటాయంటున్నారు నిపుణులు.. అయినప్పటికీ వినోదం, విద్యా, వైద్య పరంగా వాటి సానుకూల ప్రభావం ఓవరాల్ గా మంచి ఫలితాలను ఇస్తుందని అంటున్నారు.