ఎలక్షన్ వేడిలో వేములవాడ రాజకీయం మారుతోందని అధికార పార్టీ లోకల్ లీడర్లలో టాక్ నడుస్తోంది. ఇందులో కులాల గొడవ రావడం కొత్త ఈక్వేషన్స్ ను తెరపైకి తెస్తోందని చెబుతున్నారు. వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు పోటీగా సొంత పార్టీలోనే చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆల్రెడీ యాక్టివిటీ చేస్తున్నారు. మరోవైపు.. స్థానిక నేత ఏనుగు మనోహర్ రెడ్డి కూడా వేములవాడ టికెట్ పై చాలా ఆశలుపెట్టుకున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించిన ఆయనకు నిరాశే ఎదురైంది. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ హామీతోనే ఆయన బీఆర్ఎస్ లో చేరినట్లు అనుచరులు చెబుతున్నారు.
చాలామంది లీడర్లలాగే ఏనుగు మనోహర్ రెడ్డి వర్గానికి పెద్ద గౌరవం దక్కలేదన్న ఫీలింగ్ ఆయన అనుచరుల్లో ఉంది. మార్కెట్ కమిటీలు, సెస్ డైరెక్టర్లు, ఆలయ కమిటీలు, నామినేటెడ్ పోస్టులు ఎందులోనూ ఆయన మనుషులకు చోటు దక్కలేదు. తనకే ఎదురొస్తున్నారన్న కక్షతో ఎమ్మెల్యేనే ఇట్లా దూరం పెట్టారని మనోహర్ వర్గం నేతలు చెబుతున్నారు. దీంతో వీరు కూడా ఎమ్మెల్యేకు దూరంగానే ఉంటున్నారు. అధికారులకు కూడా సూచనలు ఇచ్చి మరీ ఏ పనులు కాకుండా చేస్తున్నారని వారు మండిపడుతున్నారు.
మరోవైపు సిరిసిల్ల జెడ్పీ చైర్ పర్సన్ వర్గానికి, ఎమ్మెల్యేకు కూడా గ్యాప్ పెరిగిందని లోకల్ లీడర్లు చెబుతున్నారు. నిజానికి ఎమ్మెల్యే దగ్గర మనిషిగా రాఘవరెడ్డికి పేరుంది. ఆయన భార్యను జెడ్పీ ఛైర్ పర్సన్ చేయడంలో ఎమ్మెల్మే సపోర్టే కారణమని చెబుతారు. అయితే.. ఎందుకో తరచూ ప్రోటోకాల్ గొడవలు, ఈగో సమస్యలతో ఇద్దరికీ గ్యాప్ పెరిగిందంటున్నారు. జెడ్పీలో సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే వర్గంలోనూ టాక్ నడుస్తోంది. ఇదే సెగ్మెంట్ కు చెందిన మార్క్ ఫెడ్ మాజీ ఛైర్మన్ లోక బాపురెడ్డికి, ఎమ్మెల్యే వర్గానికి విభేదాలు ఉన్నాయి.
ముగ్గురు లీడర్లు రెడ్డి వర్గం కావడంతో గొడవ కులం ట్విస్ట్ తీసుకుంది. వేములవాడ బీఆర్ఎస్ లో రెడ్లకు ప్రాధాన్యం లేదన్న టాక్ ఆ వర్గం నేతల్లో నడుస్తోంది. పదేపదే అవమానించడం, ఆత్మీయ మీటింగ్ లకూ దూరం పెట్టడం కావాలనే చేస్తున్నారని ఆ నేతలు గరమవుతున్నారు. దీంతో స్థానికంగా దశాబ్ది వేడుకల్లోనూ కొందరు నేతలు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే తీరుపై తాజాగా ముగ్గురు నేతలు మంత్రి కేటీఆర్ ను కలిసి చెప్పినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అవసరమైతే కేసీఆర్ దాకా పోవడానికి రెడీ అవుతున్నట్లు కొందరు నేతలు చెబుతున్నారు. టికెట్ కోసం పోటీ సర్వ సాధారణమైనా కులం ట్విస్టే పార్టీకి ఇబ్బంది అంటున్నారు లోకల్ లీడర్లు.
https://www.youtube.com/watch?v=fCUHn-FvKiU