జాతరను డిస్ట్రబ్ చేయాలని చూస్తుర్రు..మేడారం పై మంత్రి కీలక వ్యాఖ్యలు

మేడారం జాతర పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. జాతరను డిస్ట్రబ్ చేయాలని కొందరు చూస్తున్నట్టు తెలిపారు. మేడారం జాతర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఉత్సవ కమిటీ జాతరను విజయవంతం చేయాలని సూచించారు. మేడారం జాతర ఖ్యాతిని ప్రపంచానికి చాటాలని తెలిపారు. సమ్మక్క-సారలమ్మలది ఉద్యమ చరిత్ర అని అన్నారు. వనదేవతలను పూజించే తీరులో ఎక్కడా లోపాలు ఉండొద్దని అధికారులను ఆదేశించారు. 

ఇప్పటికే అమ్మవార్లను 30 లక్షల మంది దర్శించుకున్నాట్టు చెప్పారు. జాతరకు విడుదలైన ప్రతీ రూపాయకి లెక్కలు ఉన్నాయన్నారు. శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని మర్చిపోమని అన్నారు. పెద్దల సభకు యువకులను పంపిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని సీతక్క అన్నారు.