ఆర్టీవో అధికారులమంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారు. బాధితులు కాంక్రీట్ మిల్లర్ల ఓనర్లు, మేస్త్రీలు ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు గురువారం ఆందోళనకు దిగారు. ఆర్టీవో అధికారులమంటూ తమ బండ్లను ఆపి అక్రమంగా డబ్బులు వసూలు చేశారని వాపోతున్నారు బాధితులు. ఈ దందా సంవత్సరకాలంగా జరుగుతుందట.
Also Read :- దేశానికి తెలంగాణ మోడల్గా కులగణన
రోజుకు వేల రూపాయలు వసూళ్లు చేస్తూ.. అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంక్రీట్ మిల్లర్ల ఓనర్లు, మేస్త్రీలు ఈరోజు (నవంబర్ 21) ఉదయం నకిలీ ఆర్టీవో అధికారిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. నకిలీ ఆర్టీవో ప్రేమ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.