
- యువకుడిని కిడ్నాప్ చేసి పలుమార్లు తీవ్రంగా దాడి
- 9 మందిపై కేసు నమోదు చేసిన హనుమకొండ పోలీసులు
వరంగల్, వెలుగు: ఓ మతానికి చెందిన యువతితో మాట్లాడాడని యువకుడిని కిడ్నాప్ చేసి చితకబాదిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. బాధితుడు, పోలీసులు తెలిపిన ప్రకారం.. ములుగు జిల్లా మండలం నర్సాపూర్‍కు చెందిన కొండం సాయిచరణ్ గౌడ్ వరంగల్ లో ఉంటూ డొమినోస్ పిజ్జా బాయ్‍గా చేస్తున్నాడు. అతని సోదరి, మరో మతానికి చెందిన యువతి ఫ్రెండ్స్. హనుమకొండ చౌరస్తాలో శనివారం సాయిచరణ్ సదరు యువతితో మాట్లాడుతుండగా కొందరు యువకులు అక్కడికి వచ్చారు.
సాయిచరణ్‍ను బలవంతంగా కిడ్నాప్ చేసి బైక్‍పై తీసుకెళ్లి అలంకార్ టాకీస్ ఏరియాలో కర్రలతో దాడిచేశారు. అక్కడి నుంచి వరంగల్ జాన్‍పాక తీసుకె ళ్లి.. మరికొందరు యువకులతో కలిసి సాయిచరణ్ బట్టలు విప్పి కర్రలు, బెల్టులతో కొట్టారు. ఆపై చంపేస్తామని బెదిరించారు. బాధితుడు తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి ఆస్పత్రిలో చేరాడు. అనంతరం హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాయిచరణ్ ఫిర్యాదుతో హనుమకొండ పోలీసులు 9 మందిని నిందితులుగా గుర్తించి కేసు నమోదు చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టారు.