రాష్ట్ర ప్రభుత్వ కొత్త సీఎస్ గా సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేశ్ కుమార్ ను నియమించింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. 2020 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు సోమేశ్ కుమార్ సీఎస్ గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.
1989 బ్యాచ్ కు చెందిన సోమేష్ కుమార్ ప్రస్తుతం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, స్పెషల్ సీఎస్ గా పనిచేస్తున్నారు. సోమేష్ కు మూడేళ్లకు పైగా పదవీ కాలం ఉంది. దీంతో సీఎం కేసీఆర్ సోమేష్ కుమార్ ను సీఎస్ గా అపాయింట్ చేశారు.