తెలంగాణ నుంచి సోమేశ్ కుమార్ రిలీవ్..

తెలంగాణ నుంచి సీఎస్ సోమేశ్ కుమార్ను కేంద్రం రిలీవ్ చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ కేడర్ నుంచి తప్పించిన కేంద్రం ఆయనను ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12లోగా ఏపీలో రిపోర్ట్ చేయాలని సోమేశ్ కుమార్ను ఆదేశించింది. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. 

అంతకు ముందు సోమేశ్ కుమార్ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏం చేయాలన్న అంశంపై ముఖ్యమంత్రితో చర్చించారు. రాష్ట్ర విభజన సమయంలో ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను కూడా డీఓపీటీ  రెండు రాష్ట్రాలకు  కేటాయించింది. సోమేశ్ కుమార్‭కు ఏపీ కేడర్ అలాట్ చేసింది.  అయితే తాను  తెలంగాణకు వెళ్తానని సోమేష్ కుమార్ చెప్పారు. తనను ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ  క్యాట్‭లో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై  విచారణ జరిపిన క్యాట్ సోమేశ్ కుమార్ తెలంగాణలో కొనసాగేందుకు అనుమతించింది. 2017లో కేంద్రం క్యాట్ తీర్పును హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సోమేశ్‭ను ఏపీ కేడర్కు వెళ్లాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది.