యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని సీఎం కేసీఆర్ చీఫ్ అడ్వయిజర్, ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రధానాలయంలో స్వయంభూ నారసింహుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అద్దాల మండపం వద్ద ప్రధానార్చకులు తాండూరి వెంకటాచార్యులు ఆయనకు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో గీతారెడ్డి లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. సీఎం కేసీఆర్ కు ప్రధాన సలహాదారుగా నియామకం అయిన తర్వాత తొలిసారిగా యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆయన వెంట యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆలయ ఏఈవో రామ్మోహన్, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.