కొన్నిసార్లు అదృష్టం కూడా కావాలి : ద్రవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ముంబై : కొంచెం అదృష్టం కూడా కొన్నిసార్లు పెద్ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని టీమిండియా మాజీ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంగీకరించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్​ ఫైనల్లో ఓటమి, టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సౌతాఫ్రికాపై సంచలన విజయాలను ఇందుకు ఉదాహరణగా చూపెట్టాడు. ‘ఎత్తు పల్లాల నుంచి ఎన్నో అంశాలను నేర్చుకుంటాం. కానీ వీటన్నింటికి తోడుగా కొద్దిగా అదృష్టం కూడా ఉండాలి.  ప్రతి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి ఆలోచించడానికి చాలా టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. కానీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు చేజారిపోతాయి. 

వాటిని సరిదిద్దుకునేలోపే ఫలితాలు మారిపోతాయి. సౌతాఫ్రికాతో ఫైనల్లో 30 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 30 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావాలి. ఆ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మేం చాలా ఒత్తిడిలో ఉన్నాం. కానీ సూర్య క్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టడంతో అదృష్టం మా వైపు మళ్లింది. అదే మాకు కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తెచ్చిపెట్టింది. కానీ వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో ట్రావిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 15 సార్లు ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడానికి ప్రయత్నించాం. కానీ ఒక్కసారి కూడా అతను బ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కానివ్వలేదు. అంటే ఆ రోజు అదృష్టం మా వైపు లేదు. 

అయినా మేం ప్రయత్నించి ఫెయిలయ్యాం’ అని ద్రవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు. రాబోయే రోజుల్లో కూడా టీమిండియా విజయాల జోరును కంటిన్యూ చేస్తుందన్నాడు. ప్రస్తుతం ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లు భయం లేకుండా మంచి ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నారని కితాబిచ్చాడు. యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఇండియాలో ఉన్నాయని ద్రవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పాడు. వాటిని సరైన రీతిలో ఉపయోగించుకోవాలని సూచించాడు.