అప్పుడప్పుడూ ప్రత్యర్థులను పొగడాలె..మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్

  • కొన్నిసార్లు ప్రత్యర్థులనూ పొగడాలె
  • ఆర్ఎస్ఎస్ ప్రతిభను శరద్ పవార్ గుర్తించారు:  సీఎం ఫడ్నవీస్

ముంబై: జీవితంలో కొన్ని కొన్ని సార్లు ప్రత్యర్థులను కూడా పొగడాల్సి వస్తదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. మహారాష్ట్రలో జరిగిన లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేసిన అబద్ధాల్ని...అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ తిప్పికొట్టిందని తెలిపారు. అందువల్లే బీజేపీకి మెజారిటీ వచ్చిందని తెలిపారు.  

ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ చాలా తెలివైనవారని..అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పోషించిన కీలక పాత్ర ఆయనకు అర్థమైందని చెప్పారు. అందుకే ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ను ఆయన ప్రశంసించారని వివరించారు. 

శుక్రవారం నాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  నిర్వహించిన లేట్ విలాస్జీ ఫడ్నిస్ జీవ్ హలా కార్యక్రమంలో  సీనియర్ ఎడిటర్ వివేక్ ఘల్సాసితో జరిగిన ఇంటరాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫడ్నవీస్ మాట్లాడారు." లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలు మాపై అబద్ధాలు ప్రచారం చేశాయి.  

బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని..రిజర్వేషన్లు తొలగిస్తారని చెప్పారు. దురదృష్టవశాత్తు ప్రజలు దాన్ని నమ్మారు. దాంతో లోక్ సభ ఎన్నికల్లో మాకు తక్కువ సీట్లు వచ్చాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీన్ మారింది. 

ఆర్ఎస్ఎస్ సహకారంతో ప్రతిపక్షాల అబద్ధాలను ఎదుర్కొన్నాం. ఫలితంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆర్ఎస్ఎస్ ప్రతిభను శరద్ పవర్ గుర్తించారు. ఆయన చాలా  ఇంటెలిజెంట్. అందుకే ఇష్టం లేకపోయినా ఆర్ఎస్ఎస్ ను పొగిడి ఉంటారు. 

జీవితంలో కొన్ని కొన్ని సార్లు ప్రత్యర్థులను కూడా పొగడాల్సి వస్తుంది" అని సీఎం పేర్కొన్నారు. 2019 నుంచి 2024 మధ్య పరిణామాలను చూస్తుంటే రాజకీయాల్లో  ఏదైనా జరగవచ్చని అర్థమైనట్లు తెలిపారు. అక్కడివాళ్లు ఇక్కడకు, ఇక్కడివాళ్లు అక్కడకు వెళ్లవచ్చన్నారు.  

గతంలో ఉద్ధవ్ థాక్రే  తమకు స్నేహితుడని, ఇప్పుడు రాజ్ థాక్రే మిత్రుడని, అలా అనిఉద్ధవ్ థాక్రే తమకు శత్రువు కాదని స్పష్టం చేశారు. మోదీ చాలా క్రమశిక్షణ కలిగిన రాజకీయవేత్త అని, అయితే అమిత్ షా సౌలభ్యం కోసం రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు.