తల్లిని కొట్టిండని కండక్టర్‌‌‌‌‌‌‌‌పై దాడి చేసిన కొడుకు

తల్లిని కొట్టిండని కండక్టర్‌‌‌‌‌‌‌‌పై దాడి చేసిన కొడుకు
  • బస్సు బానెట్‌‌‌‌‌‌‌‌పై కూర్చోవద్దనడంతో  గొడవకు దిగిన మహిళ
  • ఆత్మకూరు, ములుగు  పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్లలో ఫిర్యాదు

ములుగు, వెలుగు : ఆర్టీసీ బస్సులో సీట్లు ఖాళీగా లేకపోవడంతో ఓ మహిళ బానెట్‌‌‌‌‌‌‌‌పై కూర్చుకునేందుకు ప్రయత్నించగా బస్సు డ్రైవర్‌‌‌‌‌‌‌‌, కండక్టర్‌‌‌‌‌‌‌‌ అడ్డుకున్నారు. దీంతో మహిళ ఇద్దరినీ తిట్టడంతో కండక్టర్‌‌‌‌‌‌‌‌ మహిళపై దాడి చేశాడు. అనంతరం ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. తల్లిపై దాడి ఘటన తెలుసుకున్న ఆమె కొడుకు బస్‌‌‌‌‌‌‌‌ను అడ్డుకొని కండక్టర్‌‌‌‌‌‌‌‌పై దాడి చేశాడు. ఈ ఘటన బుధవారం హనుమకొండ – ఏటూరునాగారం రూట్‌‌‌‌‌‌‌‌ బస్సులో జరిగింది. వరంగల్‌‌‌‌‌‌‌‌ 2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం మధ్యాహ్నం హన్మకొండ నుంచి ఏటూరునాగారం వెళ్తోంది.

ఆత్మకూరుకు చేరుకోగానే ఓ 50 ఏండ్ల మహిళ బస్‌‌‌‌‌‌‌‌ ఎక్కింది. బస్సులో సీట్లు లేకపోవడంతో డ్రైవర్‌‌‌‌‌‌‌‌ సీటు పక్కన ఉన్న బానెట్‌‌‌‌‌‌‌‌పై కూర్చుంది. దీంతో ఇక్కడ కూర్చోవద్దని డ్రైవర్‌‌‌‌‌‌‌‌ ఎంత చెప్పినా మహిళ వినకపోవడంతో బానెట్‌‌‌‌‌‌‌‌ పైనుంచి లేవాలని కండక్టర్‌‌‌‌‌‌‌‌ కమలాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పట్టుబట్టాడు. వెంటనే మహిళ డ్రైవర్‌‌‌‌‌‌‌‌, కండక్టర్‌‌‌‌‌‌‌‌ను తిట్టడంతో కోపోద్రిక్తుడైన కండక్టర్‌‌‌‌‌‌‌‌ మహిళను బానెట్‌‌‌‌‌‌‌‌ పైనుంచి లాగేశాడు. గొడవ పెద్దది కావడంతో బస్సును ఆత్మకూరు పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌ ఎదుట ఆపి కండక్టర్‌‌‌‌‌‌‌‌, మహిళ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. అనంతరం బస్సు అక్కడి నుంచి వెళ్లిపోయింది.

అయితే కండక్టర్‌‌‌‌‌‌‌‌ దాడి చేసిన విషయాన్ని మహిళ తన కొడుకుకు చెప్పడంతో అతడు బైక్‌‌‌‌‌‌‌‌పై తల్లిని ఎక్కించుకొని వెళ్లి మల్లంపల్లి వద్ద ఆర్టీసీ బస్సును అడ్డుకున్నాడు. తర్వాత ఇద్దరూ కలిసి కండక్టర్‌‌‌‌‌‌‌‌పై దాడి చేశారు. విషయం తెలుసుకున్న వరంగల్‌‌‌‌‌‌‌‌ 2 డిపో జీఎం, డీఎంలు ములుగుకు చేరుకొని కండక్టర్‌‌‌‌‌‌‌‌తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు మొదలైన గొడవ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.