కూర మాడిందన్నందుకు తల్లిని సుత్తెతో కొట్టిండు

మహబూబాబాద్​ అర్బన్​, వెలుగు : మహబూబాబాద్ లో దారుణం జరిగింది. భార్యను మందలించినందుకు  తల్లిపై సుత్తెతో దాడి చేసిండు ఓ కొడుకు. అసలేం జరిగిందంటే.. మహబూబాబాద్​ మండలం వేంనూర్​కు చెందిన ఇస్లావత్​ మహేందర్​, మున్సిపాలిటీలోని సాంక్రియతండాకు చెందిన నందిని ప్రేమించుకుని పెళ్లిచేసుకున్నారు. వీరికి ఓ బాబు ఉన్నాడు. మహేందర్​ తల్లిదండ్రులతో కలిసి  వేంనూర్​లో  ఉంటున్నాడు. అయితే గత కొద్ది రోజుల నుంచి భార్య నందిని, తల్లి బుజ్జిల మధ్య చిన్న చిన్న విషయాలకు గొడవలు జరుగుతున్నాయి.  శనివారం ఉదయం కోడలు నందిని కూర వండుతుండగా, అత్త  కూర మాడిపోతుందని చూసుకోమని చెప్పింది. దీంతో నందిని,  బుజ్జిల మధ్య గొడవ అయ్యింది. అప్పుడే వచ్చిన  కొడుకు మహేందర్​ ఇంట్లో ఉన్న సుత్తెతో తల్లి తలపై కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైన తల్లిని మహబూబాబాద్​ జనరల్​ ఆసుపత్రికి తరలించి  చికిత్స అందిస్తున్నారు.