నవమాసాలు మోసి పెంచిన తల్లిని వృద్ధాప్యంలో చక్కగా చూసుకోవాల్సింది పోయి ఓ కొడుకు తన తల్లి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. తల్లిని కాళ్లతో తన్ని, రక్తం కారేలా గాయపరిచాడు. ఈ హృదయ విదారక ఘటన నిజామాబాద్ జిల్లాలోని గౌతమి నగర్ లో చోటుచేసుకుంది. గౌతమ్ నగర్ లో గంగమ్మ అనే వృద్ధురాలు నివాసం ఉంటుంది. ఆమెకు పవన్ అనే కుమారుడు ఉన్నాడు.
తన తల్లి వద్ద ఉన్న బంగారం, పెన్షన్ డబ్బులు ఇవ్వాలంటూ పవన్.. గంగమ్మతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఆమెను కాళ్లతో తన్ని కొట్టాడు. దీంతో గంగమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. మనవడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పవన్ ను అరెస్ట్ చేశారు. గాయాల పాలైన వృద్ధురాలిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు స్థానికులు.