కన్న కొడుకే తండ్రి పాలిట కసాయివాడై బలితీసుకున్నాడు. రాజస్థాన్ లోని దుంగార్ పూర్ జిల్లాలో చున్నీలాల్ తండ్రిని చంపి ఇంట్లోనే పూడ్చి పెట్టాడు.రాజేంగ్ బరాండాకు ప్రకాష్, దినేష్, పప్పు, చున్నీలాల్ నలుగురు కొడుకులు. ప్రకాశ్ తన తల్లితో కలిసి అహ్మదాబాద్ లో నివసిస్తున్నాడు. దినేష్, పప్పు, చున్నీలాల్ తండ్రిలో కలిసి రాజస్థాన్ లోని దుంగార్ పూర్ జిల్లాలోని బల్వారా గ్రామంలో ఉంటున్నారు. బుధవారం తండ్రితో చున్నీలాల్ కు కొద్దిపాటి వాగ్వాదం జరిగింది. అది ముదిరి ఘర్షణకు దారితీసింది. ఆవేశంలో ఉన్న కొడుకు చున్నీలాల్ తన తండ్రి తలపై బలంగా కొట్టాడు.
దీంతో రాజేంగ్ బరాండా స్పాట్‌లో చనిపోయాడు. విషయం బయటకు తెలియకూడదని ఇంట్లో తండ్రి డెడ్ బాడీని గొయ్యి తీసు పూడ్చిపెట్టాడు. దినేష్, పప్పు లు రెండు రోజులుగా తండ్రి కనిపించడంలేదని తల్లి, ప్రకాశ్ లకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే ప్రకాశ్ తన తల్లితో గ్రామానికి వచ్చి చున్నీలాల్ ని తండ్రి ఆచూకీ గురించి నిలదీశారు. మొదట తనకు తెలియదంటూ దాటేస్తూ వచ్చిన చున్నీలాల్ శుక్రవారం తండ్రిని చంపినట్లు ఒప్పుకున్నారు. దీంతో చున్నీలాల్ పై తల్లి, అన్న కేసు పెట్టారు. పోలీసులు ఇంట్లో పూడ్చిపెట్టిన రాజేంగ్ డెడ్ బాడీ తీసి పోస్టుమార్టంకు పంపారు. కేసు నమోదు చేసుకొని, చున్నీలాల్ ని అరెస్ట్ చేశారు.