తండ్రికి పెన్షన్ ఇవ్వాలని సెల్ టవర్ ఎక్కిన కొడుకు

తండ్రికి పెన్షన్ ఇవ్వాలని సెల్ టవర్ ఎక్కిన కొడుకు

వైరా,వెలుగు :  ఖమ్మ జిల్లా వైరా మండలంలో సిరిపురం (కేజీ) గ్రామానికి చెందిన ఓ యువకుడు తన తండ్రికి పెన్షన్​ఇవ్వాలంటూ, రైతు రుణమాఫీ చేయాలంటూ సెల్ టవర్ ఎక్కాడు. స్థానికులు, బాధితుని కథనం గ్రామానికి చెందిన నారపోగు నాగకృష్ణ కూలి పని చేస్తుంటాడు. ఇతడి తండ్రి భిక్షంకు 69 ఏండ్లు. అయినా వృద్ధాప్య పింఛన్ రావడం లేదు. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నా రాలేదు. అలాగే రుణమాఫీ కూడా కాలేదు. దీంతో సాయంత్రం గ్రామంలోని సెల్​టవర్​ఎక్కాడు. తన సమస్యలు పరిష్కరిస్తేనే దిగుతానని స్పష్టం చేశాడు. ఇది చూసిన అతడి తల్లి అక్కడే స్పృహ కోల్పోయింది. విషయం తెలుసుకున్న గ్రామంలోని పలు పార్టీల లీడర్లు వచ్చి అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చేస్తామని చెప్పడంతో టవర్ దిగి వచ్చాడు.