నిమజ్జనానికి వెళ్తే తండ్రి మందలించాడని.. కొడుకు ఆత్మహత్య

కుత్బుల్లాపూర్: హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం పండుగ వాతావరణం సమయంలో విషాదం చోటుచేసుకుంది. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో ధమ్మాపల్(17) అనే యువకుడు కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అతను చింతల్‌లోని నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. సెప్టెంబర్ 14న సాయంత్రం స్నేహితులతో కలిసి గణేష్ నిమజ్జనం వెళ్లడంతో రాత్రి ఇంటికి రాలేదని అతని తండ్రి అశోక్ మందలించాడు. తండ్రి మందలించాడని క్షణికావేశంలో ధమ్మాపల్ ఉరి వేసుకొని ఆత్మహత్య  చేసుకున్నాడు. ధమ్మపల్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై సూరారం పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.