విషాదం: చిన్న కారణానికే ఉరి వేసుకొని కొడుకు సూసైడ్.. అదే తాడుతో తండ్రి ఆత్మహత్య

ఈ రోజుల్లో క్షణికావేశం జీవితాన్నే బలితీసుకుంటోంది. జీవితంపై అవగాహన లేకపోవటం.. తల్లి దండ్రుల ప్రేమాభిమానాలు, పిల్లల కోసం పడుతున్న తపన, ఆర్థిక పరిస్థితుల తెలియకపోవడంతో పిల్లలు ఆవేశాలకు లోనై తనువు చాలిస్తు్న్నారు. సంక్రాంతి పండుగ వేళ చిన్న కారణంతో కొడుకు ఉరివేసుకోవడంతో.. కొడుకు ఇక లేడన్న వార్త జీర్ణించుకోలేని తండ్రి అదే తాడుతో ఉరివేసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం మిగిల్చింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. బిలోలి  మండంలం మినాకి గ్రామంలో స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని ఉరేసుకుని చనిపోయాడు ఓంకార్ (16) అనే విద్యార్థి. తన అన్నదమ్ములతో కలిసి లాతూర్ జిల్లాలోని ఉద్గిర్ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్న ఓంకార్.. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చాడు. తండ్రి వ్యవసాయం.. పేదరికం.. అప్పుల గురించి ఏమీ ఆలోచించకుండా తనకు స్మార్ట్ ఫోన్ కొనివ్వాలని పట్టబట్టాడు. 

Also Read :- ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్ మళ్లీ డౌన్..యూజర్ల ఆగ్రహం

అప్పులున్నాయి.. చేసిన కష్టం లోన్లకే సరిపోవడం లేదు. ఇల్లు గడవడం కష్టంగా ఉంది.. .

కొడుకుకు ఫోన్ కొనివ్వలేని స్థితిలో ఉన్న అని అంతకు ముందు రోజు చాలా బాధపడ్డాడని ఓంకార్ తల్లి తెలిపారు. పిల్లల చిన్న చిన్న కోరికలు తీర్చలేని బతుకు ఏం బతుకు అని ఆ రాత్రంతా చింతించాడట. కానీ ఫోన్ కొనాలంటే కనీసం 10 వేల రూపాయలు పెట్టాలి. అదే ఉంటే ఓనెల వడ్డీ వెళ్లిపోతుంది. పంట కోసం తీసుకున్న అప్పు.. పొలం పనుల కోసం తీసుకున్న బైక్ ఈఎఐ చెల్లించడానికే డబ్బు సర్దుబాటు కావడం లేదని చెప్పాడట. ఎంత అడిగినా తండ్రి ఒప్పుకోవడం లేదనే డిజప్పాయింట్ మెంట్ తో రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడట. 

పొలానికి వెళ్లి పడుకుని ఉండొచ్చు అని అనుకున్నారట ఆ తల్లిదండ్రులు. ఎందుకంటే అప్పటికే చాలా సార్లు పొలానికెళ్లి పడుకునేవాడట. అయితే ఉదయం తండ్రి పొలం పనులకని వెళ్లే సరికి చెట్టుకు వేలాడి చనిపోయి ఉన్నాడట ఓంకార్.  దీంతో కొడుకుపై ఉన్న మమకారంతో.. కొడుకు లేడనే షాక్ లో ఏం చేయాలో తోచక అదే తాడుతో ఉరేసుకున్నాడట.  కొడుకు కోరిక తీర్చలేకపోతున్నాననే దిగులులో ఉన్న తండ్రి.. కొడుకు ఉరి వేసుకున్న తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై దిలీప్ ముండే తెలిపారు.