కులం తక్కువని ఎవరూ ఆసరా రాలే.. శవాన్ని సైకిల్‌పై తీస్కెళ్లిండు
భువనేశ్వర్: తక్కువ కులం వాడని ఓ వ్యక్తి అంత్యక్రియలకు ఊర్లో ఒక్కరూ ముందుకు రాకపోవడంతో కొడుకే ఓ సైకిల్‌కు శవాన్ని కట్టుకొని శ్మశానానికి తీసుకెళ్లాడు. గుండెలో బాధను అదిమిపెట్టుకొని తానొక్కడే అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఒరిస్సాలోని బొలంగిర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లంకబహల్ గ్రామంలో ఈమధ్య అఖయ పాత్ర అనే వ్యక్తి చనిపోయాడు. కానీ ఆయన తక్కువ కులం వాడని ఊరోళ్లు దగ్గరకు రాలేదు. అంత్యక్రియలకు హెల్ప్ చేయలేదు. దీంతో కొడుకే ఓ సైకిల్ వెనక భాగంలో శవాన్ని కట్టుకొని శ్మశానానికి తీసుకెళ్లాడు. ఇంకో బంధువు సాయంతో అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ‘మేం తక్కువ కులం వాళ్లమని ఎవరూ హెల్ప్ చేయలేదు’ అని అఖయ భార్య చెప్పారు.
పేదోళ్ల కోసం ఒరిస్సా ‘హరిశ్చంద్ర’ పథకం
ఈ సంఘటనపై బొలంగిర్ జిల్లా కలెక్టర్ అరిందమ్ దకువా స్పందించారు. ‘అధికారుల సాయాన్ని అతడు కోరలేదనకుంటా. స్థానిక అధికారులకూ విషయం తెలియదు. అవసరమైన వాళ్లకు హరిశ్చంద్ర సహాయత యోజన కింద హెల్ప్ చేయాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఏదేమైనా అతని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటాం’ అని చెప్పారు. చనిపోయిన వాళ్లకు అంత్యక్రియలు చేయడానికి ఇబ్బంది పడే పేదలకు ఆర్థిక సాయం చేసేందుకు 2013లో ఒరిస్సా సర్కారు హరిశ్చంద్ర సహాయత యోజన తీసుకొచ్చింది.
For More News..