కోటి రూపాయలు ఇచ్చి.. నాన్నను చంపించిన కొడుకు

కోటి రూపాయలు ఇచ్చి.. నాన్నను చంపించిన కొడుకు

మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి అనడానికి బెంగళూరులో జరిగిన ఓ ఘటన ఉదాహరణ నిలిచింది. కన్న తండ్రిని చంపడానికి ఓ కసాయి కొడుకు కోటి రూపాయల సుపారీ ఇచ్చాడు. బెంగుళూరుకు చెందిన మణికంఠ (32) అనే వ్యక్తి ఆస్తి కోసం తన తండ్రి నారాయణ స్వామిని (71) చంపడానికి కోటి రూపాయల సుపారీ ఇచ్చాడు. బెంగళూరులో మారతహళ్లిలోని కావరప్ప బ్లాక్ లో ఉంటున్న నారాయణ స్వామి తన రెండవ భార్యకు అపార్ట్ మెంట్ ను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీంతో కోపానికి గురైన మొదటి భార్య కొడుకు మణికంఠ ఆదర్శ, శివ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులకు సుపారీ ఇచ్చాడు. 

ఆదర్శ, శివ కుమార్ మణికంఠ ఇంటి పార్కింగ్ స్థలంలో నారాయణ స్వామిని కొడవళ్లతో హత్య చేశారు. తర్వాత మణికంఠ.. తండ్రి హత్య గురించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. విషయంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. నిందితుల్ని పట్టుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో మణికంఠనే సుపారీ ఇచ్చినట్లు కనుగొన్నారు. మణికంఠపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. గతంలో కూడా మణికంఠపై హత్య కేసు ఉంది. పోలీస్ స్టేషన్లో శిక్ష అనుభవించాడు.