
- ఆదిలాబాద్ జిల్లా కమలాపూర్ లో ఘటన
గుడిహత్నూర్, వెలుగు: మద్యం తాగొచ్చి కూతురితో గొడవపడుతుండగా అడ్డుకోబోయిన అత్తపై అల్లుడు దాడి చేసిన ఘటన ఆదిలాబాద్జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గుడిహత్నూర్ మండలం కమలాపూర్‌కు చెందిన నాగాడే శశికళ తన కూతురు రేణుకను నార్నూర్ మండలం మహాగావ్‌కు చెందిన బావ్‌నే వెంకటికి ఇచ్చి 2008లో పెండ్లి చేసింది.
అతడు తరుచూ తాగి ఇంట్లో గొడవలు చేస్తుండగా భరించలేక భార్య పుట్టింటికి వెళ్లి ఉంటోంది. వెంకటి కూడా అత్తగారింటికి వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ ఉంటున్నాడు. అక్కడ కూడా మద్యంతాగి తరుచూ భార్యతో గొడవ పడుతున్నాడు. ఆదివారం తాగొచ్చి భార్యతో వెంకటి గొడవ పడుతుండగా అత్త శశికళ అడ్డుకుంది.
దీంతో కోపంతో అతడు గొడ్డలితో ఆమె దాడి చేయడంతో మెడపై గాయమైంది. స్థానికులు శశికళను రిమ్స్‌కు తరలించారు. పోలీసులకు తెలపడంతో వెళ్లి నిందితుడు వెంకటిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన్టటు ఎస్‌ఐ మహేందర్ చెప్పారు.