- మంచిర్యాల జిల్లాలో ఘటన
కోల్‌బెల్ట్, వెలుగు : తన సెల్‌ఫోన్ తిరిగిమ్మన్నందుకు ఓ కొడుకు తండ్రిని హత్య చేశాడు. మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి కథనం ప్రకారం..సింగరేణి రిటైర్డ్కార్మికుడు బామండ్లపెల్లి రాయమల్లు(60) మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లోని అల్లూరి సీతారామరాజునగర్ లో ఉంటున్నాడు. ఇతడికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య మీనమ్మ ముగ్గురు పిల్లలతో గుడిపేటలో ఉంటోంది. చిన్న భార్య రాజేశ్వరి, కొడుకు రాకేశ్, కోడలు అంజలితో కలిసి రాయమల్లుతో ఉంటున్నారు. కూలీ పనిచేసే రాకేశ్మద్యానికి బానిసై తరచూ కుటుంబసభ్యులతో గొడవపడుతున్నాడు.
ఈ మధ్య రాకేశ్తన సెల్ఫోన్పోగొట్టుకొని తండ్రి రాయమల్లు సెల్ఫోన్వాడుతున్నాడు. గురువారం రాత్రి తన ఫోన్తనకు ఇచ్చేయాలని రాయమల్లు కొడుకుతో గొడవపడ్డాడు. దీంతో ఆవేశానికి లోనైన రాకేశ్ఇంట్లో ఉన్న రోకలిదుడ్డుతో తండ్రి తలపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాకేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శశీధర్‌రెడ్డి, టౌన్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.