కిరోసిన్ పోసి నిప్పంటించిన కొడుకు.. వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం
ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులనే చంపాడో కొడుకు. కిరోసిన్ పోసి నిప్పు అంటించి కిరాతకంగా హత్య చేశాడు. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం మడిపల్లి గ్రామ శివారు భూక్య తండాలో బుధవారం ఈ దారుణం చోటుచేసుకుంది. నెక్కొండ సీఐ పెద్దన్నకుమార్ వివరాల ప్రకారం.. భూక్య దస్రూ(70), బాజు దంపతులకు కేతురాం, వీరన్న ఇద్దరు కుమారులు. వీరికి 3.30 ఎకరాల భూమి ఉంది. కుమారులకు కొన్నేళ్ల కిందట ఈ భూమిని పంచి ఇచ్చారు. 2015లో చిన్న కుమారుడు వీరన్న అనారోగ్యంతో చనిపోయాడు. అనంతరం ఆ భూమిని దస్రూ, బాజు కుమార్తె భద్రమ్మ కొనుగోలు చేసింది.
ఈ విషయంలో పెద్దకొడుకు కేతురాం కొన్ని నెలలుగా తల్లిదండ్రులతో తరచూ గొడవ పడుతున్నాడు. పోలీస్ స్టేషన్, అటు నుంచి కోర్టుల వరకు గొడవ వెళ్లింది. భూమిపై సర్వహక్కులు భద్రమ్మకు ఉన్నాయంటూ న్యాయస్థానం కూడా స్టే ఇచ్చింది. ఈ క్రమంలో బుధవారం మళ్లీ గొడవ జరిగింది. దీంతో అందరూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అందరికీ సర్ది చెప్పిన పోలీసులు కేతురాంకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయితే సాయంత్రం ఇంటికి చేరుకున్న కేతురాం, అతడి కుమారుడు వెంకటేశ్.. వృద్ధులతో గొడవకు దిగారు. కోపంతో ఇంట్లోనే తల్లిదండ్రులపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో దంపతులు ఇద్దరూ సజీవదహనం అయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పెద్దన్నకుమార్
తెలిపారు.