
భువనేశ్వర్: ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని చెప్పినందుకు ఓ యువకుడు తన తల్లిదండ్రులను కొట్టి చంపేశాడు. అడ్డుకున్న అక్క పైనా దాడి చేసి ఆమె ప్రాణాలు తీశా డు. ఒడిశాలోని జగత్సింగ్ పూర్ జిల్లాలో మంగళవారం ఈ దారుణం జరిగింది. మొబైల్ ఫోన్లో నిత్యం గేమ్స్ ఆడుతున్న సూర్యకాంత్(21)ను తల్లిందండ్రులు మందలించారు.
ఏం జరిగిందో తెలియదుగానీ, మంగళవారం (మార్చి 4) సూర్యకాంత్ బండరాయితో తల్లి కనక్లత(62), తండ్రి ప్రశాంత్ సేథీ(65)ని కొట్టి చంపాడు. అడ్డుకోబోయిన అక్క రోసలిన్(25)పైనా రాయితో దాడి చేయగా, ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు వెళ్లి డెడ్‌బాడీలను పోస్ట్‌మార్టానికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.