
నవమాసాలు పెంచి పోషించిన కన్నతల్లిని ఇంటి నుంచి బయటకు గెంటివేశాడు ఓ కొడుకు. ఈ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి చిలుకనగర్ లో చోటుచేసుకుంది. దీంతో ఆ తల్లి కొడకు ఇంటి ముందు నిరసనకు దిగింది. చిలకానగర్ లో నివాసముంటున్న వంగరి రమాదేవికి..ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. భర్త చనిపోగా, కొడుకు శివశంకర్ డాక్స్ గ్లోబల్ హై స్కూల్ ని సొంతంగా నడిస్తున్నాడు. కొడుకు శివశంకర్ తన ఆస్తిని బలవంతంగా అతని పేరుపై రాయించుకున్నాడంటూ రమాదేవి ఆవేదన వ్యక్తం చేస్తుంది.
దీంతో దిక్కుదోచని స్థితిలో ఉన్న రమాదేవి ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్లి ఉంటుంది. అయితే రమాదేవి ఆరోగ్యం బాగోలేక పోవడంతో ఆమెను ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి ముగ్గురు కూతుళ్లు తమ ఇంటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో శివశంకర్ తల్లిని ఇంటి నుండి గెంటేశాడు. ఈ క్రమంలో ఆమె నిరసనకు దిగింది. ఆమెకు పలు మహిళ సంఘాలు మద్దతు పలికాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చట్టం ప్రకారం శివ శంకర్ పై చర్యలు చేపడతామన్నారు.